ఆ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు క్వారంటైన్: యూఏఈ
- April 05, 2023
యూఏఈ: మార్బర్గ్ వైరస్ వ్యాధి కేసులు అధికంగా ఉన్న ఈక్వటోరియల్ గినియా, టాంజానియాలకు వెళ్ళి వచ్చిన యూఏఈ నివాసితులు తప్పనిసరిగా క్వారంటైన్ లోకి వెళ్లాలని యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ (Mohap) సూచించింది. అదే విధంగా వైరస్ సంబంధిత లక్షణాలు కనిపిస్తే.. ప్రయాణికులు సమీపంలోని ఆరోగ్య సదుపాయం లేదా ఆసుపత్రులలోని అత్యవసర విభాగాలలో వైద్య సంరక్షణ కేంద్రాలను సంప్రదించాలని కోరింది. "ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణించిన వారు మార్బర్గ్ వైరస్ వ్యాధి వ్యాప్తి చెందుతున్న ప్రాంతానికి వెళ్లినట్లు లేదా సోకిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారని వైద్య సిబ్బందికి తెలియజేయాలి" అని మోహప్ ఒక ప్రకటనలో తెలిపింది. 21 రోజుల కంటే ఎక్కువ రక్తస్రావ జ్వరం లక్షణాలను ప్రదర్శిస్తున్న వారు కూడా వైద్య సహాయం తీసుకోవాలని కోరారు.
మార్బర్గ్ వైరస్ వ్యాప్తి కారణంగా ఈక్వటోరియల్ గినియా, టాంజానియాలకు ప్రయాణించవద్దని ఇప్పటికే యూఏఈతోపాటు అనేక అరబ్ దేశాలు సూచనలు జారీ చేశాయి. ఈ రెండు దేశాల్లో ఇప్పటి వరకు కనీసం 14 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు.
వైరస్ లక్షణాలు..
మార్బర్గ్ వైరస్ వ్యాధి అనేది తీవ్రమైన, ప్రాణాంతక రక్తస్రావ జ్వరం. మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనది. ఈ వ్యాధి మార్బర్గ్ వైరస్, గబ్బిలాలు నివసించే గనులు లేదా గుహలు వంటి ప్రాంతాలలో నివసించే జంతువుల నుండి మానవులకు వ్యాపించే జూనోటిక్ RNA వైరస్. వైరస్ లక్షణాలు అకస్మాత్తుగా పెరుగుతాయి. జ్వరం, చలి, తలనొప్పి, మైయాల్జియా, ఛాతీ నొప్పి, గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి. వ్యాధి పెరుగుతున్న కొద్దీ లక్షణాలు కూడా తీవ్రమవుతాయి. కామెర్లు, బరువు తగ్గడం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడి ప్రాణాప్రాయం కలుగవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!







