ఈద్ అల్ ఫితర్ 2023: 5 రోజులపాటు సెలవులు..!
- April 16, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ కోసం అధికారిక సెలవుదినాలను యూఏఈ మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. కాగా, చంద్రుడు కనింపిచే దాని ఆధారంగా నివాసితులు ఇస్లామిక్ పండుగను జరుపుకునేందుకు నాలుగు, లేదా ఐదు రోజుల వరకు సెలవులు పొందే అవకాశం ఉంది. సెలవులు రమదాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు (ఇస్లామిక్ క్యాలెండర్ నెలలు) ఉండనున్నాయి. ఇదిలా ఉండగా.. యూఏఈ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల అధికారిక సెలవులను ఏకీకృతం చేసింది. అంటే ఎమిరాటీలు, ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ప్రవాసులు ఒకే విధమైన సెలవులను పొందుతారు.
ఎన్ని రోజుల సెలవులు?
ఇస్లామిక్ నెలలు 29 లేదా 30 రోజుల పాటు కొనసాగుతాయి. చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు అనే దానిపై ఆధారపడి రమదాన్ సెలవులు ఉంటుంది. రమదాన్ 29.. ఏప్రిల్ 20 (గురువారం) వస్తుంది. అంటే ఈద్ సెలువులు ప్రారంభమవుతాయి. అదే రాత్రి, ఈద్ తేదీలను నిర్ధారించడానికి యూఏఈ చంద్రుడిని చూసే కమిటీ సమావేశమవుతుంది. రాత్రి చంద్రుడు కనిపిస్తే.. ఏప్రిల్ 21(శుక్రవారం) ఈద్ మొదటి రోజు అవుతుంది. ఇది నివాసితులకు నాలుగు రోజుల సెలవులు వస్తాయి. ఒక వేళ ఆరోజు రాత్రి చంద్రుడు కనిపించకపోతే, ఏప్రిల్ 22(శనివారం)న ఇస్లామిక్ పండుగ ప్రారంభమవుతుంది. ఇలాగైతే నివాసితులు ఐదు రోజుల పాటు సెలవులు వస్తాయి. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, ఈ సంవత్సరం రంజాన్ 29 రోజులు ఉంటుంది. యూఏఈతో సహా చాలా ఇస్లామిక్ దేశాలలో ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు ఏప్రిల్ 21(శుక్రవారం) అవుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







