ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
- April 17, 2023
అమరావతి: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం జగన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మంది ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం వైయస్ జగన్ రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని, రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని సూచించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో మైనారిటీలకు ఎంతో మేలు జరిగిందని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వం మైనారిటీలను పట్టించుకోలేదని అంజాద్ బాషా విమర్శించారు. మైనారిటీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత సీఎం జగన్ దేనని కొనియాడారు.
ఇక ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు







