స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు
- April 18, 2023
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటటిఫికేషన్ ద్వారా మొత్తం 239 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇస్కో స్టీల్ ప్లాంట్ బర్నపూర్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
భర్తీ చేయనున్న అప్రెంటిస్ ఖాళీలలో ఎలక్ట్రిషియన్ 65, ఫిట్టర్ 57, రిగ్గర్ 18, టర్నర్ 12, మెషినిస్ట్ 15, వెల్డర్ 32, కంప్యూటర్/ఐసీటీఎస్ఎం 6, ఆర్ఈఎఫ్ అండ్ ఏసీ 16, మెకానిక్ మోటార్ వెహికల్ 5, ప్లంబర్ 6, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్) 7 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 7,000 నుంచి రూ.7,700 స్టైపెండ్ చెల్లిస్తారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 29, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;http://https://www.sail.co.in/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







