రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని

- April 22, 2023 , by Maagulf
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని

న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. మసీదులు, మైదానాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని దేశ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ప్రేమ, కరుణ యొక్క పండుగ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇతరులకు సహాయం చేయాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు.

ఈద్ శుభ సందర్బంగా సమాజంలో సోదరభావాన్ని పెంపొందించేందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దామని తెలిపారు. ముస్లీం సోదరులకు ప్రధాని మోదీ ఈద్ ముబారక్ తెలిపారు. మన సమాజంలో సామరస్యం, కరుణ, స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

ఢిల్లీ జమామసీద్ లో ప్రార్ధనలకు వేలాదిగా ముస్లింలు హాజరయ్యారు. పార్లమెంట్ స్ట్రీట్ మసీదులో ప్రార్ధనల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్, బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ముంబైలోని మహిమ్ దర్గాలో నమాజ్ కు ముస్లింలు భారీగా తరలివచ్చారు.

కేరళ కలూర్ అంతర్జాతీయ స్టేడియంలో నమాజ్ లో నటులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు. బీహార్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. రంజాన్ వేడుకల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా జమా మసీదులో నమాజ్ లో బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com