ఖోర్ ఫక్కన్‌లో బోటు ప్రమాదం.. భారతీయ ప్రవాసుడు మృతి
- April 25, 2023
యూఏఈ: ఆదివారం ఖోర్ ఫక్కన్‌లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో షార్జాకు చెందిన భారతీయ ప్రవాసుడు మరణించాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా మరో ముగ్గురు గాయపడినట్లు షార్జా పోలీసులు ధృవీకరించారు. కాగా, ఏడేళ్ల భారతీయ జాతీయురాలైన చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స కొనసాగుతోందని, ఇతరులు డిశ్చార్జ్ అయ్యారని పోలీసులు తెలిపారు. 38 ఏళ్ల అభిలాష్ సుదీర్ఘ ఈద్ వారాంతంలో ఖోర్ ఫక్కన్ బీచ్‌లో తన సహచరులతో కలిసి బోటింగ్‌కు వెళ్లాడు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 16 మంది ప్రయాణికులు, ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అభిలాష్ మృతదేహాన్ని ఖోర్ ఫక్కన్ ఆసుపత్రి నుండి ఫుజైరా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పేపర్ వర్క్ పూర్తిచేసి మృతదేహాన్ని మంగళవారం లేదా బుధవారం నాటికి స్వదేశానికి తరలించాలని భావిస్తున్నట్లు సామాజిక కార్యకర్తలు చెప్పారు. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన అభిలాష్ షార్జాలోని ఒక ప్రైవేట్ సంస్థలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









