కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..

- May 02, 2023 , by Maagulf
కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదితర నేతలు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను రూపొందించారు. ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో హామీలను గుప్పించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన హమీలు..
.ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
.కుటుంబ పెద్దగా ఉండే మహిళలకు నెలకు రూ. 2 వేలు
.నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 3 వేల భృతి
.డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు రూ. 1,500
.కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
.ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాది లోగా భర్తీ
.ప్రతి వ్యక్తికి 10 కేజీల ఆహార ధాన్యాలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com