భారత్ - యూఏఈ మధ్య పెరగనున్న విమాన సర్వీసులు..!
- May 02, 2023
యూఏఈ: భారతదేశ విమానయాన మార్కెట్ భారీగా పెరుగుతుంది. UAE నివాసితులు, భారతీయ పర్యాటకుల నుండి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా భారతదేశం - యూఏఈ మధ్య విమాన సర్వీసులు పెంచాల్సిన అవసరం ఉందని దుబాయ్ ఆధారిత క్యారియర్ ఫ్లైదుబాయ్ CEO ఘైత్ అల్ ఘైత్ తెలిపారు. ఈ మార్గాల్లో వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా దుబాయ్, యూఏఈ మరియు భారతదేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులకు అవకాశం ఉందన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, విమానయాన రంగం బలమైన ఆర్థిక వృద్ధిని పరిగణనలోకి తీసుకుని, ఎయిర్ ఇండియా తన విమానాలను అప్డేట్ చేయడానికి మరియు దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఎయిర్‌బస్ , బోయింగ్ నుండి $80 బిలియన్ల విలువైన 470 విమానాలను భారీ ఆర్డర్ చేసిన విషయం తెలిసినదే.
ఏప్రిల్‌లో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఢిల్లీ , ముంబై నుండి దుబాయ్‌కి ఎయిర్ ఇండియా అదనపు విమానాలను ప్రకటించింది. యూఏఈ, భారతదేశం మధ్య విమాన సర్వీసుల కొరత కారణంగా, ప్రయాణ సీజన్లలో విమాన ఛార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఎమిరేట్స్‌లో 3.5 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు పని చేస్తున్నారు. విమాన ఛార్జీలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, వేసవి వరకు ప్రస్తుత స్థాయిలలో కొనసాగే అవకాశం ఉందని ఘైత్ అల్ ఘైత్ చెప్పారు. ఇటీవల ఎమిరేట్స్ ప్రెసిడెంట్ సర్ టిమ్ క్లార్క్ కూడా రెండు దేశాల మధ్య అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను కూడా పెంచాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







