ఇండియా సహా 7 దేశాల పాస్‌పోర్ట్‌లో వీసా స్టిక్కర్లు రద్దు: సౌదీ
- May 05, 2023
యూఏఈ: యూఏఈ, ఇండియా, ఫిలిప్పీన్స్‌తో సహా ఏడు దేశాలలో తమ మిషన్ల కోసం ఇప్పుడు వీసా స్టిక్కర్లను ఇ-వీసాలతో భర్తీ చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. సాధారణంగా ఒక వ్యక్తి పాస్‌పోర్ట్‌పై ఉంచే స్టిక్కర్‌కు బదులుగా, డేటాను చదవడానికి క్యూఆర్ కోడ్లు ఉపయోగించబడుతున్నాయని కింగ్డమ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యూఏఈ, ఇండియా, జోర్డాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లోని సౌదీ అరేబియా మిషన్లలో మే 1 నుండి ఈ వ్యవస్థ అమలులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ గెజిట్‌లోని నివేదిక ప్రకారం.. కాన్సులర్ సేవలను ఆటోమేట్ చేయడానికి.. వర్క్, రెసిడెన్సీ, విజిట్ వీసాలతో సహా వివిధ రకాల వీసాల మంజూరు కోసం ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకోబడిందని సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







