98% పూర్తయిన బార్బర్ మోడల్ గార్డెన్ ప్రాజెక్ట్

- May 08, 2023 , by Maagulf
98% పూర్తయిన బార్బర్ మోడల్ గార్డెన్ ప్రాజెక్ట్

బహ్రెయిన్: బార్బర్ మోడల్ గార్డెన్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ప్రస్తుతం ప్రాజెక్ట్ 98% పూర్తయిందని మున్సిపల్ వ్యవహారాలు, వ్యవసాయ శాఖ మంత్రి వేల్ బిన్ నాసర్ అల్-ముబారక్ తెలిపారు. BD434,000తో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ బార్బర్‌లోని ప్రజల కోసం గ్రీన్ కవర్‌ను మెరుగుపరచడానికి,  ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి సమీకృత వినోద ప్రాజెక్ట్‌లో భాగమన్నారు. పురపాలక వ్యవహారాల అండర్‌ సెక్రటరీ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫా, ఉత్తర ప్రాంత మున్సిపాలిటీ డైరెక్టర్‌ జనరల్‌, కౌన్సిల్‌ హెడ్‌ జైనా జాసిమ్‌, మంత్రిత్వ శాఖ అధికారులతో మంత్రి ప్రాజెక్ట్‌ సైట్‌లో పర్యటించారు. నార్తర్న్ గవర్నరేట్‌లోని ప్రాజెక్ట్.. బ్లాక్ 526లో మొత్తం వైశాల్యం 8484.5 చదరపు మీటర్లలో చేపడుతున్నారు. ఇందులో 915 చదరపు మీటర్ల పిల్లల ఆట స్థలం, 693 చదరపు మీటర్ల కుటుంబ ప్రాంతం, 2,794 మీటర్ల పచ్చని ప్రాంతం, 356 చెట్లు, కార్ పార్క్‌లు మరియు ఇతర సౌకర్యాల కోసం కేటాయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com