మిస్టరీ గా మారిన ఆంధ్రా యువతి కేసు

- May 10, 2016 , by Maagulf
మిస్టరీ గా మారిన ఆంధ్రా  యువతి కేసు

రియాద్ నుంచి వచ్చిన ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత కనిపించకుండాపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరికి చెందిన షేక్ రహీమున్నీసా(45) ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం రియాద్ వెళ్లింది. ఎయిర్ ఇండియా 9122 విమానంలో ఈ నెల 8వ తేదీన రియాద్ నుంచి ఆమె బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రహీమున్నీసా అక్కడి నుంచి ఇంటికి చేరుకోలేదు. బంధువుల ఆమె కోసం గాలించినా ఫలితం లేకుండా పోవడంతో మంగళవారం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com