ఐపిఎల్ 2023 : 3బెర్త్‌లు.. రేసులో ఏడు జట్లు..
- May 16, 2023
ఇండియన్ ప్రిమియర్ లీగ్(IPL) లీగ్ పోటీలు చివరిదశకు చేరుకున్నాయి. మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్-చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌తో ప్రారంభమైన సీజన్-16 ఐపిఎల్ పోటీలు మే 21(ఆదివారం) బెంగళూరు-గుజరాత్ జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్‌తో ముగియనున్నాయి. ఇక గుజరాత్ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 18పాయింట్లతో టాప్‌లో నిలిచి ఇప్పటికే ప్లే-ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేరుకోగా.. మిగిలిన మూడు బెర్త్‌ల కోసం 7జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఏ జట్టు ప్లే-ఆఫ్‌కు చేరుతుందా? ఏ జట్టు ఆ రేసునుంచి వైదొలుగుతుందా? అనే ఉత్కంఠ క్రీడాభిమానుల్లో రోజు రోజుకూ పెరుగుతోంది. మొత్తం 10జట్లు ప్రాతినిధ్యం వహించిన సీజన్-16 ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే-ఆఫ్ రేసునుంచి ఇప్పటికే నిష్క్రమించాయి. మిగిలిన 8జట్లలో గుజరాత్ మినహా.. మిగిలిన 7జట్లకూ ఆ ఛాన్స్ ఉంది. ఈ సమీకరణలు 17న ముంబయి-లక్నో జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందు వరకు మాత్రమే.
ఇక చెన్నై(15పాయింట్లు), ముంబయి(14పాయింట్లు), లక్నో(13పాయింట్లు) టాప్-4 నిలిచి ప్లే-ఆఫ్ రేసులో ఉండగా.. బెంగళూరు మినహా.. రాజస్తాన్, కోల్‌కతా, పంజాబ్ జట్లు 13మ్యాచ్‌లు ముగిసిన అనంతరం 12పాయింట్లతో దాదాపు ప్లే-ఆఫ్ రేసునుంచి నిష్క్రమించాయి. అద్భుతం జరిగితే మినహా ఈ మూడు జట్లు ప్లే-ఆఫ్‌కు చేరడం కష్టమే. ఇక బెంగళూరుకు జట్టు విషయానికొస్తే.. బెంగళూరు జట్టు ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌లను సన్‌రైజర్స్, గుజరాత్‌లతో ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచుల్లో గెలిస్తే.. బెంగళూరు ఖాతాలో 16పాయింట్లు వస్తాయి. దీంతో ఆ జట్టు ప్లే-ఆఫ్‌కు చేరుకొనే ఛాన్స్ ఉంది.ముంబయి, లక్నో జట్లు తమ చివరి రెండు లీగ్ మ్యాచుల్లో ఓడితేనే బెంగళూరుకు ఈ ఛాన్స్ దక్కనుంది. మరోవైపు ముంబయి జట్టు లక్నో, సన్‌రైజర్స్ జట్లతో, లక్నో జట్టు ముంబయి, కోల్‌తా జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్లు ప్లే-ఆఫ్‌కు చేరతాయి. ఇక చెన్నై జట్టు 20న ఢిల్లీతో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో నిమిత్తం లేకుండా నేరుగా ప్లే-ఆఫ్‌కు చేరుతుంది. ఆ మ్యాచ్‌లో ఓడితే మాత్రం లీగ్ మ్యాచ్‌లు ముగిసేవరకు వేచిచూడాల్సిన పరిస్థితి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా విమానంలో RAT అకస్మాత్తుగా తెరుచుకుపోయింది
- 200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!
- కువైట్ బేలో ముల్లెట్ ఫిషింగ్ పై నిషేధం ఎత్తివేత..!!
- గాజాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలను స్వాగతించిన ఒమన్..!!
- సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- రియాద్ లో బ్రిడ్జి పై నుండి కిందపడ్డ పోలీస్ వాహనం..!!
- బ్లాక్ 338లో పార్కింగ్ స్థలాలను తొలగింపు..!!
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు