సౌదీ అరేబియాలో మెట్ పల్లి పట్టణ వాసి మృతి
- May 16, 2023
సౌదీ అరేబియా: తెలంగాణలోని జగిత్యాల జిల్లా, మెట్పల్లి పట్టణానికి చెందిన మార్గం విజయ్,(36) సౌదీ అరేబియా అలహాస ప్రాంతంలో మరణించాడు.చిన్న వయసులో తండ్రిని కోల్పోయి అనాధగా మారిన దీక్షిత,అక్షిత. ఉన్న అప్పులు కట్టుకోవడానికి జీవితం సరిపోయింది, ఇంకా 10 లక్షలు అప్పు ఉంది. కుటుంబ పోషణ కోసం, బిడ్డలను గొప్పగా చదివించాలని, ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లడం జరిగింది. తాను పనిచేస్తున్న కంపెనీ లోనే తిరుపతి రాచకొండ, వైజాగ్ రాజు, మరియు ఫరూక్ మరియు అబ్దుల్ రఫీక్, చిన్న అంజయ్య, మారుతి మార్గం, పెరిక రాజేందర్, లక్ష్మీనారాయణ గౌడ్, మరియు ఇండియన్ ఎంబసీ కు చెందిన ముయోద్దీన్ రెహమతుల్లా సహకారంతో మృతదేహాన్ని ఇంటికి చేర్చడం జరిగింది. విమానాశ్రయం నుంచి మృతదేహాన్ని ఇంటికి చేర్చడానికి బడుగు లక్ష్మణ్ ఎన్నారై చిన్నారి డిపార్ట్మెంట్ చిట్టిబాబు సహకారంతో ఉచిత అంబులెన్స్ సమకూర్చడం జరిగింది. గల్ఫ్ లో చనిపోయిన నిరుపేద గల్ఫ్ కార్మికుడు మృతదేహాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తక్షణ సహాయం కింద ఐదు లక్షల రూపాయలు తక్షణ సహాయం అందించాలని,గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్ల నిధులతో ఎన్నారై పాలసీ అమలు చేసే విధంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కృషి చేయాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ సభ్యులు విన్నపం తెలియజేశారు.
తాజా వార్తలు
- 200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!
- కువైట్ బేలో ముల్లెట్ ఫిషింగ్ పై నిషేధం ఎత్తివేత..!!
- గాజాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలను స్వాగతించిన ఒమన్..!!
- సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- రియాద్ లో బ్రిడ్జి పైనుండి కిందపడ్డ పోలీస్ వాహనం..!!
- బ్లాక్ 338లో పార్కింగ్ స్థలాలను తొలగింపు..!!
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!