CEPA: యూఏఈ - ఇండియా వాణిజ్యం బూస్ట్..!
- May 17, 2023
యూఏఈ: భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దూసుకుపోతుంది. ఈఆర్థిక ఒప్పందం రెందు దేశాల మధ్య సంబంధాలను.. సాంస్కృతిక సంబంధాన్ని బలపరిచిందని ఉన్నత స్థాయి అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జరిగిన విస్తృతస్థాయి చర్చలో రెండు దేశాల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు సంబంధించిన స్టార్టప్‌ల కన్వర్జెన్స్ పాయింట్లను స్పృశించారు. ఉదార విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FBI) విధానం భారతదేశాన్ని ఆకర్షణీయమైన వ్యాపార గమ్యస్థానంగా మార్చిందని చెప్పారు. సంస్కరణలు, బలమైన స్థూల ఆర్థిక మూలాధారాలతో సహా అనేక అంశాలు - ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశం వృద్ధిలో కీలక పాత్ర పోషించాయని UAEలో భారత రాయబారి సంజయ్ సుధీర్ వివరించారు. ఈ చర్చలో
భారతదేశ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సారథ్యంలో నడిచే పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం (DPIIT) ప్రమోషన్ విభాగంలో కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, DPIIT జాయింట్ సెక్రటరీ సంజీవ్, వాణిజ్య మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ శ్రీకర్ కె. రెడ్డి కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి)తో న్యూఢిల్లీ జరిపిన చర్చల్లో పాల్గొన్నారు.
ద్వైపాక్షిక వాణిజ్యం 16% వృద్ధి
2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 16% వృద్ధిని నమోదు చేసి 84 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుందని, భారతదేశం –యూఏఈ మధ్య మే 1, 2022న అమలులోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ)పై ఒక ప్రశ్నకు సమాధానంగా జాయింట్ సెక్రటరీ రెడ్డి తెలిపారు. యూఏఈ నుండి భారతదేశం దిగుమతులు 2022-23లో 18% వృద్ధి చెంది $53 బిలియన్లకు చేరుకోగా, తమ ఎగుమతులు కూడా 12% వృద్ధి చెంది $31.3 బిలియన్లకు చేరాయని రెడ్డి చెప్పారు. రత్నాలు, ఆభరణాలు , ఆటోమొబైల్ రంగాలలో సాధించిన విజయాలను హైలైట్ చేసారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇనుము, ఉక్కు, దుస్తులు వంటి రంగాలు ఆశించిన స్థాయిలో రాణించలేదని ఆయన పేర్కొన్నారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి
2021-22లో అత్యధికంగా దాదాపు $84 బిలియన్ల ప్రవాహాలను నమోదు చేసిన భారతదేశం, "ఆచరణాత్మకంగా ఓపెన్ స్కై" ఎఫ్‌డిఐ పాలసీని కలిగి ఉంది. కోవిడ్ సమయంలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి సవాళ్లు, అవకాశాలపై ఒక ప్రశ్నకు డిపిఐఐటి కార్యదర్శి సింగ్ చెప్పారు. రక్షణ మొదలైన కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను మినహాయించి మేము బయట పెట్టేది ఏమీ లేదు - ఇక్కడ FDI సాధ్యమే కానీ కొన్ని ప్రభుత్వ అనుమతులతో. మీరు మా తయారీ రంగాన్ని చూస్తుంటే, మేము ఇటీవలే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది దాదాపు 14 రంగాలను కవర్ చేస్తుందన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5.9% వృద్ధి చెందుతుందని, దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారుస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఈ ఏడాది ప్రారంభంలో పేర్కొంది. అదే సమయంలో, గ్లోబల్ రియల్ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధిని 2023కి 2.8% మరియు 2024కి 3%గా అంచనా వేసింది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..