ల్యాండింగ్ సమయంలో ఒమన్ విమానానికి ప్రమాదం..!
- May 17, 2023
మస్కట్: మస్కట్ నుండి ఇరాన్‌లోని షిరాజ్‌కు వెళ్లే ఒమన్ ఎయిర్ ఫ్లైట్ (డబ్ల్యూవై 2435) సోమవారం షిరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా రన్‌వేపై శిధిలాల కారణంగా దెబ్బతిందని ఒమన్ సుల్తానేట్ జాతీయ క్యారియర్ వెల్లడించింది. ఒమన్ ఎయిర్ మంగళవారం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో తెలిపింది. విమానాన్ని సురక్షితంగా మస్కట్‌కు తిరిగి తీసుకురావడానికి ఇంజనీరింగ్ బృందాన్ని పంపించినట్లు పేర్కొంది. ఒమన్ ఎయిర్ తదుపరి షెడ్యూల్‌లో ప్రయాణికులను అప్‌డేట్ చేయడానికి స్థానిక సర్వీస్ ప్రొవైడర్‌లతో సమన్వయం చేసుకుంటోందన్నారు. అక్కడ చిక్కుకున్న ప్రయాణీకులను తీసుకురావడానికి మరొక విమానాన్ని పంపినట్లు ఒమన్ ఎయిర్ తెలిపింది. విమానం దెబ్బతిన్నందుకు ప్రయాణికులు, సిబ్బందికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..