టిల్లుగానితో రొమాన్స్‌కి సై అంటోన్న సమంత.!
- May 17, 2023
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ‘ఓ బేబీ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సంచలన విజయం అందుకుంది. నందినీ రెడ్డితో మరో సినిమాకి సమంత సై అంటోందని తాజా సమాచారం.
ఇంకా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు కానీ, ఆల్రెడీ సమంతకు స్ర్కిప్టు వినిపించినట్లు తెలుస్తోంది. అన్నట్లు ఈ సినిమాలో టిల్లు గాడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడట.
సమంత ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆ యాంగిల్లో ఈ కాంబినేషన్ ఒకింత ఆసక్తికరంగా అనిపిస్తోంది.
కానీ, కాంబో పరంగా ఇది పక్కా క్రేజీయెస్ట్ కాంబోనే. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఇదో డిఫరెంట్ కాంబినేషన్ అవుతుంది. ప్రస్తుతం సమంత ‘ఖుషీ’ సినిమా కోసం విజయ్ దేవరకొండతో జత కడుతోన్న సంగతి తెలిసిందే. అలాగే, సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’తో బిజీగా వున్నాడు.
తాజా వార్తలు
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్‌లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్‌లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!