ఒమన్‌లో దొంగతనం, విధ్వంసానికి పాల్పడిన 12 మందిని అరెస్ట్
- May 17, 2023
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ డబ్బు దొంగిలించారనే ఆరోపణలపై నలుగురు పౌరులను అరెస్టు చేసింది. దొంగతనం, విధ్వంసానికి పాల్పడినందుకు 11 మంది ప్రవాసులను మస్కట్ గవర్నరేట్‌లో అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు.
సుర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో దొంగిలించారని, అలాగే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని పలు వాణిజ్య సంస్థల దుకాణాల నుంచి ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగిలించారని ఆర్‌ఓపి తెలిపింది. మరొక సంఘటనలో మస్కట్ గవర్నరేట్‌లోని రాయల్ ఒమన్ పోలీసులు 11 మంది ఆసియా జాతీయులను విధ్వంసం, దొంగతనం ఆరోపణలపై అరెస్టు చేశారు. వారు అల్ మబేలా ప్రాంతంలో విద్యుత్ తీగలు, వైర్లను కత్తిరించి దొంగిలించారని.. పైన పేర్కొన్న నిందితులందరిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి