55.2 కిలోల కొకైన్.. 11 మంది విదేశీయులు అరెస్ట్
- May 18, 2023
జెడ్డా: జెడ్డా గవర్నరేట్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC) అనేక ఇళ్లలో దాచిన 55.2 కిలోగ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి 11 మంది విదేశీయులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నలుగురు ప్రవాసులు, విజిట్ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన ఐదుగురు నైజీరియన్ పౌరులు, సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన ఇద్దరు ఉన్నారు. ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో 911..మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని భద్రతా అధికారులు పిలుపునిచ్చారు. లేదా GDNC 995 నంబర్‌లో లేదా ఇ-మెయిల్ [email protected] ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా పెడతామని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!