పన్ను మోసం కేసు..దుబాయ్ కోర్టులో సంజయ్ షాకు చుక్కెదురు

- May 18, 2023 , by Maagulf
పన్ను మోసం కేసు..దుబాయ్ కోర్టులో సంజయ్ షాకు చుక్కెదురు

యూఏఈ: పన్ను మోసం కేసులో దుబాయ్ కోర్టులో బ్రిటిష్ హెడ్జ్ ఫండ్ వ్యాపారి సంజయ్ షాకు చుక్కెదురైంది. డెన్మార్క్ పన్ను అథారిటీకి $1.7 బిలియన్ల పన్ను ఎగవేత కేసులో సంజయ్ ను దుబాయ్ అత్యున్నత న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఫైనాన్షియర్ సంజయ్ షా 2012 నుండి 2015 వరకు అమలులో ఉన్న స్కీమ్‌కు సూత్రధారిగా కింది కోర్టులో దోషిగా నిర్ధారించారు. విదేశీ వ్యాపారాలు డానిష్ కంపెనీలలో వాటాలను కలిగి ఉన్నట్లు చూపించి.. వాటికి అర్హత లేని పన్ను వాపసులను క్లెయిమ్ ను పొందాడు. ఈ కేసులో గతేడాది దుబాయ్‌లో సంజయ్ అరెస్టయ్యాడు.

2018 ఆగస్టులో మొదటిసారి కేసు దాఖలు చేసినప్పటి నుండి వచ్చిన $1.7 బిలియన్లపై 5 శాతం వడ్డీని చెల్లించాలని షా,  పథకంలో చిక్కుకున్న అనేక విదేశీ వ్యాపారులను కోర్ట్ ఆఫ్ కాసేషన్ ఆదేశించింది. దుబాయ్‌లోని డానిష్ కస్టమ్స్ అండ్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (DCTA) ప్రతినిధి ఈ తీర్పుపై స్పందించారు. యూఏఈ న్యాయవ్యవస్థ వైఖరిని ఈ తీర్పు ధృవీకరిస్తుందని తెలిపారు. గత సెప్టెంబరులో షా మరియు అతని సహచరులు డానిష్ పన్ను అధికారుల నుండి అక్రమంగా డబ్బు సంగ్రహించినందుకు దుబాయ్ అప్పీల్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. అతని న్యాయవాదులు ఆ తీర్పును కోర్ట్ ఆఫ్ కాసేషన్‌కు అప్పీల్ చేసారు.  ఏప్రిల్‌లో బహిష్కరణకు వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌ను దుబాయ్ కోర్టు తిరస్కరించిన తర్వాత షాను డెన్మార్క్‌కు అప్పగించాలని ప్రత్యేక తీర్పులో ఆదేశించింది.  పన్ను మోసం ఆరోపణలపై అతను డెన్మార్క్‌లో ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com