‘ఆది పురుష్’కి సక్సెస్ ఫార్ములా అద్దబోతున్నారా.?
- May 25, 2023ప్రబాస్ నటించిన ‘ఆది పురుష్’ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. వచ్చే నెల్లో రిలీజ్‌కి సిద్ధంగా వున్న ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో బిజీగా వున్నారు చిత్ర యూనిట్.
ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఇంతవరకూ వున్న నెగిటివిటీని కాస్తయినా తుడిచి పెట్టే ప్రయత్నం చేసిందనే చెప్పాలి. అలాగే, ఇక ఇప్పుడు మరో ప్రయత్నానికి తెర లేపారు.
సినిమాకి సెంటిమెంట్ ఆపాదిస్తున్నారు. అందులో భాగంగా, ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతిలో ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
ప్రబాస్‌ని ప్యాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన ‘బాహుబలి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలోనే చేశారు. ఆ సినిమా సక్సెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు. ఆ తర్వాత ప్రబాస్ నుంచి వచ్చిన ఏ సినిమా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.
సో, ‘ఆది పురుష్’ ద్వారా ఆ కల నెరవేర్చాలనుకుంటున్నారు కాబోలు. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. కనీసం ఈ సెంటిమెంట్ అయినా ప్రబాస్‌కి కలిసొస్తుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?