ఖర్జూర ఉత్పత్తిలో జీసీసీలో ఒమన్ కు రెండవ స్థానం

- May 31, 2023 , by Maagulf
ఖర్జూర ఉత్పత్తిలో జీసీసీలో ఒమన్ కు రెండవ స్థానం

మస్కట్: సుల్తానేట్‌లోని ఒకటి కంటే ఎక్కువ విలాయత్‌లలో ఖర్జూరాల సీజన్ ప్రారంభమైంది.  సుల్తానేట్‌లో ఖర్జూర చెట్ల సంఖ్య 9 మిలియన్లకు పైగా ఉన్నదని, ఒమన్ సుల్తానేట్ ప్రస్తుతం ఖర్జూర ఉత్పత్తిలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఉందని, ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో మరియు గల్ఫ్‌లో రెండవ స్థానంలో ఉందని వ్యవసాయం, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖలో నిపుణుడు ఇంజనీర్ హైథమ్ బిన్ బదర్ అల్-ఖంజరి తెలిపారు.  62,000 ఎకరాల విస్తీర్ణంలో ఖర్జూర పంట విస్తరించి ఉందని, ఒక తాటికి  ప్రపంచ సగటు 40 కేజీలతో పోలిస్తే..51 కిలోల ఉత్పాదకతో ఒమన్ ముందు వరుసలో ఉందన్నారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఖర్జూరం 2021లో 374,000 టన్నులకు చేరుకుందని, వినియోగానికి 53% పోగా 4% తయారీకి.. 4% ఎగుమతికి.. మిగిలినవి పశుగ్రాసంగా ఉపయోగించబడ్డాయన్నారు. 2021 గణాంకాల ప్రకారం.. 26,817 టన్నుల ఉత్పత్తితో ఒమన్ సుల్తానేట్‌లో ఇబ్రి విలాయత్ అత్యంత ఉత్పాదక రాష్ట్రంగా నిలిచిందన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com