రామ్ గోపాల్ వర్మ గొప్పతనం అదే.!
- June 02, 2023పబ్లిసిటీ కోసం ఎంత దూరమైనా పోతాడాయన. ఎంతకైనా దిగజారిపోతాడు కూడా. ఒకప్పుడు సంచలన సినిమాలు తెరకెక్కించిన ఆయన, ఇప్పుడు ఆ సంచలనాల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు.
ఆయన మరోవరో కాదు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మే. ఆయన తాజాగా ‘వ్యూహం’ అనే మూవీ తెరకెక్కిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కి సంబంధించిన కాంట్రవర్షియల్ ఇతివృత్తాన్ని మూల వస్తువుగా తీసుకుని ఈ ‘వ్యూహం’కి కథ రచించేశారాయన. హా.! వర్మ సినిమాల్లో ఏముంటుందిలే.. అని లైట్ తీసుకుంటున్నారా.? మీ లైట్‌ని మేం కాదనలేం కానీ, ఒక్క విషయంలో ఆయన్ని మెచ్చుకోకుండా వుండలేం.
పాత్రలు, పాత్ర ధారులు. తాజాగా ఆయన ‘వ్యూహం’ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో జగన్ ఆయన భార్య భారతి పాత్రలను చూపించారు.
అవి పాత్రలే కావచ్చు.. ఆ పాత్రల్లో రియల్ మనుషుల్ని అచ్చుగుద్దినట్లుగా దించేస్తుంటారాయన. రిలీజ్ చేసిన పోస్టర్లలో జగన్, ఆయన భార్య భారతిలను అచ్చు గుద్దినట్లుగా అలాగే దించేశారు. ఈ పోస్టర్ గురించి ఇదే చర్చ జరుగుతోంది. ‘రంగం’ ఫేమ్ అజ్మల్, ‘హైవే’ ఫేమ్ మానస రాధాకృష్ణ ఈ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది రిలీజ్ అయ్యే సినిమానేనా.? అని మాత్రం అడగొద్దు ప్లీజ్.!
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు