గ్రాండ్ గా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్‌మెంట్
- June 10, 2023
హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్‌మెంట్ గత రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. గత కొన్ని నెలలుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరు..ఇప్పుడు వివాహ బంధం తో ఒకటి కాబోతున్నారు. ఈ క్రమంలో వీరి ఎంగేజ్‌మెంట్ శుక్రవారం సాయంత్రం నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీలు మాత్రమే ఈ వేడుకలో సందడి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి మొదటిసారిగా 2017లో ‘మిస్టర్’ సెట్స్ లో కలుసుకున్నారు. షూటింగ్ సమయం లో ఇరువురి మధ్య స్నేహం పెరిగింది..ఆ స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ జంట రెండవ చిత్రం అంతరిక్షం 9000 KMPH చిత్రీకరణ సమయం లో డేటింగ్ చేస్తున్నారనే వార్త వెలుగు లోకి వచ్చింది. చివరికి వరుణ్ తేజ్-లావణ్య కలిసి బహిరంగంగా కనిపించడం ప్రారంభించారు. ఇక ఇప్పుడు వివాహం బంధం తో త్వరలో ఒకటి కాబోతున్నారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









