'TANA'లో దేవిశ్రీ ప్రసాద్ సంగీత హంగామా
- June 10, 2023
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో అందరికీ నచ్చే ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా సినీ సంగీత విభావరులు ఉంటాయి.
ఈ సారి తానా 23వ మహాసభల్లో టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరిని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పేన్ ఇండియా మ్యూజికల్ డైరెక్టర్‌గా పేరు పొందటంతోపాటు ఎన్నో అవార్డులను అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ తానా మహాసభలకు వచ్చేవారికి తనదైన స్టయిల్లో సినీసంగీత హంగామాను పంచనున్నారు. మరి ఆలస్యం ఎందుకు వెంటనే మీ పేరును రిజిష్టర్ చేసుకోండి. తానా మహాసభలకు వచ్చి దేవిశ్రీ హంగామాలో పాలుపంచుకోండి. https://tanaconference.org/register-now-details.html
తాజా వార్తలు
- సందర్శకులను అబ్బురపరుస్తున్న మస్కట్ నైట్స్..!!
- కువైట్ లో 45 మంది డ్రైవర్లకు జైలు శిక్ష..!!
- బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- జుమేరా బీచ్1 విస్తరణ 95% పూర్తయింది.. షేక్ హమ్దాన్
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!







