10 విదేశీ కార్ ఏజెన్సీలకు భారీ జరిమానా విధించిన సౌదీ
- June 12, 2023
రియాద్: సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని 10 కార్ ఏజెన్సీలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక జరిమానాలు విధించింది. ఇది సౌదీ కమర్షియల్ ఏజెన్సీ చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనలను ఉల్లంఘించినందుకు.. అలాగే నిర్వహణ, విడిభాగాల సదుపాయం, తయారీ నాణ్యతను నిర్ధారించడం, వినియోగదారునికి అమ్మకాల తర్వాత సేవలను అందించడం కోసం నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు విధించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వినియోగదారుల అభ్యర్థన తేదీ నుండి 14 రోజులలోపు ప్రత్యేక సాంకేతిక వివరణలతో కూడిన విడిభాగాలను అందించడంలో విఫలమైనందుకు జర్మన్ కార్ ఏజెన్సీ ఉల్లంఘనలకు పాల్పడింది. ఉల్లంఘనలకు పాల్పడిన రెండు అమెరికన్ కార్ ఏజెన్సీలకు జరిమానాలు విధించారు. మూడు జపాన్ కార్ ఏజెన్సీలకు మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది. చట్టం నిర్దేశించిన 14 రోజుల వ్యవధిలో వినియోగదారునికి విడిభాగాలను అందించడంలో ఆలస్యం కారణంగా జరిమానా విధించారు. అదేవిధంగా తన కొత్త కారును డెలివరీ చేయడంలో జాప్యం చేసినందుకు, ఇతర కారణాలతో నాలుగు చైనా కార్ ఏజెన్సీలకు మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది.
తాజా వార్తలు
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు







