తానా మహాసభలకు 48వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి రమణకి ఆహ్వానం…

- June 12, 2023 , by Maagulf
తానా మహాసభలకు 48వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి రమణకి ఆహ్వానం…

అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.

భారతదేశ అత్యున్నత న్యాయస్థాన విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ ని మహాసభలకు రావాల్సిందిగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి ఆహ్వానించారు. తానాతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇటీవల విశాఖపట్టణంలో తానా ఏర్పాటు చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యసంపుటి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. మహాసభలకు ఆయన రాక మరింత శోభను తీసుకువస్తుందని నిర్వాహకులు అంటున్నారు.

ఈ మహాసభలకు ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు, ఇతర రంగాల నిపుణులు వస్తున్నారు. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు చేయనున్న ఈ మహాసభలకు అందరూ హాజరవ్వాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. వెంటనే తమ పేర్లను రిజిష్టర్‌ చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com