హమ్మయ్యా.! తమన్నా కన్ఫామ్ చేసేసిందిగా.!
- June 13, 2023
మిల్కీ బ్యూటీ తమన్నా లవ్ కన్ఫామ్ చేసేసింది. గత కొన్ని రోజులుగా తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో వుందనీ డేటింగ్ కూడా చేస్తోందనీ వార్తలు వినిపిస్తున్నాయ్.
ఈ వార్తలపై తాజాగా తమన్నా స్పందించింది. స్పందించడమే కాదు, తన లవ్‌ని కన్ఫామ్ చేసేసింది కూడా. విజయ్‌తో వుంటే తాను సంతోషంగా వుంటానని చెప్పింది. ఎవరితో అయితే, ప్రేమగా వుంటే సంతోషంగా వుంటామని భావిస్తామో అలాంటి ప్రేమే తనకు కావాలి.. అనీ తమన్నా చెప్పుకొచ్చింది.
అంతేకాదు, చాలా మంది హీరోలతో తాను కలిసి పని చేసినా, విజయ్ తనకెంతో ప్రత్యేకమైన వ్యక్తిగా అభివర్ణించింది. విజయ్ తనను జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడన్న నమ్మకం వ్యక్తం చేసింది. సో, తమన్నా, విజయ్ వర్మకి కమిట్ అయిపోయినట్లే.. సో, త్వరలోనే ఈ లవ్వు జంట పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవడం పక్కా.! అని తమన్నా ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.
అన్నట్లు ఈ జంట ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!