వేసవిలో అంజీర్ పండు అంత ప్రమాదకరమా.?
- June 13, 2023అంజీర్ పండు, అత్తి పండు, ఫిగ్స్.. ఇలా రకరకాల పేర్లతో పిలవబడే ఈ పండు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పచ్చిగా వున్న అంజీర్ పండునే కాదు, ఎండబెట్టిన అంజీర్‌ని సైతం ఆరోగ్యకరమైన చిరుతిండిగా తింటుంటారు చాలా మంది.
అయితే, అంజీర్‌ని వేసవిలో ఎక్కువగా తినడం అంత మంచిది కాదంటున్నారు. ఫ్రెష్‌గా వున్న అత్తి పండును తీసుకుంటే పెద్దగా ప్రమాదం లేదనీ, ఎండబెట్టి, ఎక్కువ రోజులు నిల్వ వుంచిన అంజీర్ పండుతోనే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అంజీర్‌లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయ్. సో సీజన్లో ఈ పండు తింటే ఎలాంటి సమస్య వుండదు. అలాగే, ఫైబర్ ఎక్కువగా వుండే ఈ పండులో అన్ని రకాల విటమిన్లు, పోషకాలు అధికంగా లభిస్తాయ్.
తద్వారా అజీర్తి సమస్యలు తదితర జీర్ణ సమస్యలు తలెత్తవు. అలాగే, ఏమైనా ఇన్ఫెక్షన్లుంటే తగ్గిపోతాయ్. వేసవిలో ఈ పండ్లు ఎక్కువ రోజులు నిల్వ వుండవు. త్వరగా పాడయిపోతాయ్. అలా ఎక్కువ నిల్వ వున్న అత్తి పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తి వాంతులు, విరేచనాల వంటి సమస్యల బారిన పడే అవకాశముంది. అందుకే సమ్మర్లో ఈ పండ్లను మితంగా తింటే మంచిదని వైద్యుల సలహా.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?