ఈద్ అల్ అధా 2023: దుబాయ్, అబుభాబిలో బాణసంచా వేడుకల సమయాలు
- June 16, 2023
యూఏఈ: ఈద్ అల్ అధా సెలవులను జరుపుకుంటున్న నివాసితుల కోసం - అద్భుతమైన ఉత్సవాలు స్వాగతం పలుకుతున్నాయి. ఈద్ అల్ అదా సందర్భంగా ప్రత్యేక అలంకరణలతో దేశంలోని వీధులు, రహదారులు వెలిగిపోతున్నాయి. షాపర్లు మరియు డైనర్ల కోసం మంచి డీల్‌లు ఆకర్షిస్తున్నాయి. అయితే, మీరు కుటుంబం మరియు స్నేహితులతో కలిసి బాణసంచా వేడుకలను తిలకించేందుకు ఈ ప్రదేశాలను మిస్ అవ్వకండి.
దుబాయ్ పార్క్స్, రిసార్ట్స్
జూన్ 27 నుండి జూలై 1 వరకు ఈద్ కోసం ఐదు రాత్రులు బాణాసంచా వేడుకలను నిర్వహించనున్నారు. జూన్ 27 నుండి జూలై 1 వరకు - రాత్రి 9 గంటలకు దుబాయ్ పార్క్స్ లో ఫైర్స్ వర్క్స్ ప్రారంభం అవుతాయి. రాత్రి 8 గంటలకు రివర్ల్యాండ్లో డినో మానియా పరేడ్‌ను చూడవచ్చు.
దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్: ఈద్ 2వ రాత్రి
దుబాయ్ ఫెస్టివల్ సిటీ ప్రపంచ-స్థాయి వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం ఈద్ అల్ అదా రెండవ రాత్రి బాణాసంచా వేడుకలను నిర్వహించనున్నారు. మిరుమిట్లు గొలిపే బాణసంచా ప్రదర్శనతో పాటు మాల్-వెళ్లేవారు ఫెస్టివల్ బేలో అత్యాధునికమైన లేజర్, లైట్, వాటర్ మల్టీ-సెన్సరీ లను కూడా వీక్షించగలరు.
యాస్ బే అబుధాబి
జూన్ 28 నుండి జూన్ 30 వరకు అబుధాబిలోని యాస్ బేలో మూడు రాత్రులు బాణసంచా వేడుకలు సందడి చేయనున్నాయి. ప్రదర్శన రాత్రి 9 గంటల నుండి 9.10 గంటల వరకు ఫైర్ వర్క్స్ షెడ్యూల్ చేశారు.
హుదైరియత్ ఐలాండ్
జూన్ 29న అబుధాబిలోని హుదైరియత్ ద్వీపంలోని మర్సానా వద్ద రాత్రిపూట బాణసంచా వేడుకలను నిర్వహించనున్నారు. ఆహార ప్రియుల కోసం గో-టు స్పాట్లో 15 సిట్ డౌన్ తినుబండారాలు మరియు నాలుగు ఫుడ్ ట్రక్కులు ఉన్నాయి. డైనర్లకు జూన్ 29 రాత్రి 9 గంటలకు ఐదు నిమిషాలపాటు బాణసంచా ప్రదర్శన ఆకట్టుకోనుంది.
అల్ దఫ్రా
జూన్ 28న అల్ దఫ్రాకు ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు వెళ్లే వారు రాత్రి 9 గంటలకు 10 నిమిషాల బాణసంచా ప్రదర్శన చూడవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!