మే లో 2.8%కి పెరిగిన సౌదీ ద్రవ్యోల్బణం

- June 16, 2023 , by Maagulf
మే లో 2.8%కి పెరిగిన సౌదీ ద్రవ్యోల్బణం

రియాద్: సౌదీ అరేబియాలో 2022లో అదే నెలతో పోలిస్తే వినియోగదారుల ధరల సూచిక (CPI) మే 2023లో 2.8%కి పెరిగింది. ఏప్రిల్ 2023లో అంచనా వేసిన 2.7% పెరుగుదల కంటే ఎక్కువగా ఉందని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్(GASTAT) తెలిపింది. హౌసింగ్, నీరు, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధనాల ధరలు 8.4% పెరగగా..  ఆహారం, పానీయాల ధరలు 0.9% పెరిగాయి. మే 2022తో పోలిస్తే మే 2023లో ద్రవ్యోల్బణానికి అద్దె ధరలే ప్రధాన కారణమని GASTAT పేర్కొంది.

మే 2023 కోసం అథారిటీ జారీ చేసిన వినియోగదారుల ధరల సూచిక నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియాలో గృహాల వాస్తవ అద్దెలు 9.9% పెరిగాయి. అపార్ట్‌మెంట్ల అద్దెలు 23.7% పెరిగాయి. అంతేకాకుండా ఆహారం, పానీయాల ధరలు 0.9% పెరుగుదలను నమోదు చేశాయి. మాంసం, పౌల్ట్రీ ధరల పెరుగుదల 2.4%గా ఉంది.  గుడ్లు సహా పాలు, పాల ఉత్పత్తుల ధరలు 8.5% పెరిగాయి.

ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫీజులలో 4.5% పెరుగుదల ఫలితంగా విద్యా విభాగం 3.0% పెరుగుదలను నమోదు చేసింది. టూరిస్ట్ ట్రిప్స్ (సెలవు ప్యాకేజీలు) ధరలలో 14.1% పెరుగుదల కారణంగా వినోదం, సంస్కృతి రంగం 3.8% పెరుగుదలను నమోదు చేసింది. రెడీమేడ్ గార్మెంట్స్ ధరలు 3.3% తగ్గడం వల్ల బట్టలు, బూట్ల ధరలు 2.2% తగ్గాయని GASTAT వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com