రెండోసారి స్పోర్ట్స్ ఛాంపియన్ అరెస్ట్
- June 18, 2023
దుబాయ్: డ్రగ్స్ అమ్మినందుకు 13 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత విడుదలైన ఒక స్పోర్ట్స్ ఛాంపియన్‌ను దుబాయ్ పోలీసులు రెండోసారి అరెస్ట్ చేశారు. క్రీడాకారుడు తనకున్న పేరును, ప్రముఖు వ్యక్తులతో సంబంధాలను ఉపయోగించి తన వ్యాపారాన్ని తెలివిగా కొనసాగించాడని పోలీసులు తెలిపారు. సన్నిహితుల ద్వారా డ్రగ్స్ వ్యాపారం చేసేవాడని, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి సులువుగా డబ్బు సంపాదించడానికి ఆ స్పోర్ట్స్ పర్సన్ డ్రగ్స్ మార్గం ఎంచుకున్నాడని వివరించారు. ఇతర దేశాలకు చెందిన డీలర్లతో కలిసి డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడని, గుర్రపు సామాగ్రిలో నిషేధిత పదార్థాలను దాచిపెట్టి రవాణా చేసేవాడని తెలిపారు. అయితే దుబాయ్ పోలీసులకు అతని కార్యకలాపాల గురించి సమాచారం లభించడంతో.. వల పట్టుకున్నారు. అతని ప్రమోటర్లను అరెస్టు చేశారు. అధికారులు అతని రెండవ భార్య ఇంటిపై దాడి చేసి, పోషకాహార సప్లిమెంట్లలో పెద్ద మొత్తంలో దాచిన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తన నేరాలన్నింటినీ స్పోర్ట్స్ స్టార్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత, క్రిమినల్ కోర్ట్ ఛాంపియన్‌కు జీవిత ఖైదు విధించింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







