మహేష్ సినిమాపై ఏంటీ రూమర్స్.?
- June 20, 2023
మహేష్ - త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి మొదట్నుంచీ అనేక రకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయ్. స్టార్ట్ అయిన వెంటనే చకచకా మొదటి షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.
ఆ తర్వాత మహేష్ ఇంట నెలకొన్న అనూహ్యమైన వరుస విషాదాలు.. సినిమాకి బ్రేక్‌కి కారణమయ్యాయ్. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతోంది.
ఇదిలా వుంటే, రోజుకో రకంగా కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న రూమర్లు మహేష్ అభిమానుల్ని ఆందోళనకి గురి చేస్తున్నాయ్. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట.. అంటూ నిన్నటి వరకూ ప్రచారం జరిగింది.
అబ్బే.! అలాంటిదేం లేదంటూ.. చిత్ర యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. తాజాగా హీరోయిన్ అయిన పూజా హెగ్దే హ్యాండిచ్చిందంటూ ఇంకో గాసిప్ పుట్టించారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









