అక్కడ పవన్.. ఇక్కడ షూటింగ్స్.! నో బ్రేక్స్ బాస్.!

- June 20, 2023 , by Maagulf
అక్కడ పవన్.. ఇక్కడ షూటింగ్స్.! నో బ్రేక్స్ బాస్.!

పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయ వ్యవహారాలతో బిజీగా వుండగా.. మరోపక్క ఆయన చేయాల్సిన సినిమాల షూటింగులు చకచకా జరిగిపోతున్నాయ్. 

ఆయన లేకుండానే మిగిలిన ఆర్టిస్టులతో షూటింగ్ కానిచ్చేస్తున్నారు మేకర్లు. సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబో మూవ ‘బ్రో’ చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.

అలాగే, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలోనే కాస్త డైలమా నెలకొని వుండగా.. రాజకీయ యాత్ర ముగించుకున్న వెంటనే మళ్లీ షూటింగులకు హాజరు కానున్నాడట పవన్ కళ్యాణ్.

‘ఓజీ’కి సంబంధించినంతవరకూ ఇటీవలే సెట్స్‌లో అడుగు పెట్టిన శ్రియా రెడ్డిపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందనీ సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com