రాబోయే పదేళ్లలో 28వేల మంది పైలట్లు అవసరం

- June 24, 2023 , by Maagulf
రాబోయే పదేళ్లలో 28వేల మంది పైలట్లు అవసరం

యూఏఈ: మిడిల్ ఈస్ట్ ఏవియేషన్ సెక్టార్‌కు 78,000 కొత్త క్యాబిన్ క్రూ, 28,000 పైలట్లు అవసరమవుతారని మిడిల్ ఈస్ట్ ఏవియేషన్ రంగం కొత్త నివేదిక తెలిపింది.  రాబోయే పదేళ్లలో పదివేల మంది పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, సాంకేతిక నిపుణులను నియమించుకోవాల్సి ఉంటుంది. కెనడియన్ సంస్థ CAE తన 2023 ఏవియేషన్ టాలెంట్ ఫోర్‌కాస్ట్‌ను ప్రచురించింది. ఇది రిటైర్మెంట్‌లు, రీప్లేస్‌మెంట్‌లు,  పరిశ్రమ విస్తరణ నుండి ఆశించే ఖాళీలను భర్తీ చేయడానికి 2032 వరకు ఎయిర్‌లైన్‌లకు విస్తృతమైన రిక్రూట్‌మెంట్ అవసరమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే పదేళ్లలో విమానయాన రంగానికి మరో 1.3 మిలియన్ల నిపుణులు అవసరమని CAE తెలిపింది. CAE నివేదిక ప్రకారం.. 2032 నాటికి మధ్యప్రాచ్యానికి 78,000 మంది క్యాబిన్ సిబ్బంది, 28,000 మంది వాణిజ్య పైలట్లు, 22,000 వాణిజ్య విమాన నిర్వహణ సాంకేతిక నిపుణులు అవసరం అవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com