పవన్ నిర్మాతల్లో మొదలవుతోన్న గుబులు.!
- June 24, 2023
ఓ పక్క పవన్ కళ్యాణ్ సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే, మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు.
ఒక్కో సినిమానీ పూర్తి చేసుకుంటూ పోతున్నారు. ఎలక్షన్స్ లోపల సినిమాలు పూర్తి చేసి, రిలీజ్ చేసేయాలన్నదే పవన్ కళ్యాణ్ యోచన.
అంతా బాగానే వుంది. కానీ, టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ పవన్ నిర్మాతల్లో గుబులు మొదలైందట. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పవన్ సినిమాల తీరు ఏమీ బాగుండడం లేదు.
గతంలో వచ్చిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాల విషయంలో చాలానే రచ్చ జరిగింది. టిక్కెట్ల రేట్లు తగ్గించేయడం.. సినిమా ప్రదర్శితమవుతుంటే ఆపేయడం.. ధియేటర్లు బద్దలు కొట్టేయడం.. ఇలా నానా రకాల యాగీ చేశారు అక్కడి ప్రభుత్వ పెద్దలు.
దాంతో, తెలియలేదు కానీ, కొన్ని చోట్ల నష్టాలు కూడా బాగానే చవి చూశారు నిర్మాతలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుణ్యమా అని ఎలాగో గట్టెక్కేశారప్పుడు.
కానీ, ఇఫ్పుడు పరిస్థితులెలా వుండబోతాయా.? అని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. ఈ ఆందోళన తీరాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే. జూలైలో ‘బ్రో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్