‘భోళా శంకర్’ టీజర్ విడుదల..

- June 24, 2023 , by Maagulf
‘భోళా శంకర్’ టీజర్ విడుదల..

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, త‌మ‌న్నా జంట‌గా న‌టిస్తున్న చిత్రం భోళా శంక‌ర్‌. కీర్తి సురేష్ ఇందులో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తుంది. సుశాంత్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

భోళా శంకర్ సినిమా తమిళ్ లో అజిత్ చేసిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక భోళా శంకర్ సినిమాని ఆగ‌స్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో చిరు తెలంగాణ భాషలో క్యారెక్టర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. టీజర్ లో ఫుల్ మాస్ గా చిరుని చూపించారు. చివర్లో స్టేట్ డివైడ్ అయినా అంతా నా వాళ్ళే అంటూ డైలాగ్ అదరగొట్టారు మెగాస్టార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com