బహ్రెయిన్‌లో తగ్గిన డ్రగ్-సంబంధిత కేసులు
- June 27, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో మాదకద్రవ్యాల సంబంధిత ఫిర్యాదుల రేటు గత మూడు సంవత్సరాల్లో నమోదైన మొత్తం నేర సంబంధిత కేసుల్లో 3% తగ్గుదల నమోదైనట్లు అంతర్గత మంత్రి, డ్రగ్ నియంత్రణ జాతీయ కమిటీ ఛైర్మన్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా తెలిపారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని బహ్రెయిన్ జరుపుకుంటుందన్నారు. సరిహద్దుల్లో, ఇళ్లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, పాఠశాలలు, యువజన కేంద్రాల వద్ద, మీడియా, సైబర్‌స్పేస్‌లో డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడటం చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. 1987లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 25ని అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినంగా పేర్కొంటూ తీర్మానాన్ని ఆమోదించిందని గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితి 2022 నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 270 మిలియన్లకు పైగా మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్నారు. డ్రగ్ సంబంధిత నివేదికలను పరిశీలిస్తే, బహ్రెయిన్‌లో గత మూడేళ్లుగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. మాదకద్రవ్యాల వ్యసనం రికవరీ రేట్లను ట్రాక్ చేయడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించడానికి జాతీయ ప్రాజెక్ట్ ప్రారంభించబడిందన్నారు. అనేక రకాల కృత్రిమ మేధస్సు(ఏఐ) పద్ధతులను ఉపయోగించి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి, చికిత్స మరియు కోలుకునే సమయంలో కుటుంబాలు, ఇతర మానసిక మద్దతుదారులకు సహాయం అందించడానికి ప్రాజెక్ట్ ఉద్దేశించదని షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!