ఎక్కువ బరువే కాదండోయ్.! తక్కువ బరువు కూడా ఓ ఆరోగ్య సమస్యే

- June 28, 2023 , by Maagulf
ఎక్కువ బరువే కాదండోయ్.! తక్కువ బరువు కూడా ఓ ఆరోగ్య సమస్యే

 లేకుండా అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.మరి, బరువు తక్కువగా వున్న వాళ్లు ఏం చేస్తే సరిపడా బరువు పెరుగుతారు.? ఏముంది ఈ పండ్లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే సరి.
అరటి పండు: ఇది చాలా ఈజీగా అందరికీ లభించే పండు. ఈ పండులో ఎక్కువ కాలరీలుంటాయ్. అధిక బరువున్నవాళ్లు అరటి పండు ఎక్కువగా తింటే ఎక్కువ బరువు పెరుగుతారు. తక్కువ బరువున్న వాళ్లు తింటే సరిపడా బరువు పెరుగుతారు.
అవకాడో: ఇది కాస్త రేర్ ఫ్రూట్. కానీ, ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు అధిక మొత్తంలో వుంటుంది. 100 గ్రాముల అవకాడోలో 160 కేలరీల శక్తి లభిస్తుంది. సో, తక్కువ బరువు సమస్య వున్న వాళ్లు ఈజీగా బరువు పెరగొచ్చు.
మామిడి: సీజనల్‌గా లభించే అత్యంత రుచికరమైన పండు ఇది. ఒక కప్పు మామిడి పండు ముక్కల్లో 99 కేలరీల శక్తి లభిస్తుంది. సో, బరువు పెరగాలనుకునేవాళ్లు ఈ పండును కూడా అధికంగా తీసుకుంటే మంచిది. 
ఖర్జూరం పండులో 66.5 కేలరీల శక్తి లభిస్తుంది. బరువు పెరగడంతో పాటూ, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఖర్జూరంతో లభిస్తాయ్. అంజీర్, కిస్‌మిస్ కూడా ఈ లిస్టులో చేర్చుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com