అల్-జోర్ రిఫైనరీలో అగ్నిప్రమాదం

- July 03, 2023 , by Maagulf
అల్-జోర్ రిఫైనరీలో అగ్నిప్రమాదం

కువైట్ : అల్-జోర్ రిఫైనరీ యూనిట్ నంబర్ 12లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను ఆర్పివేసినట్లు కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ (KIPIC) తెలిపింది. KIPIC తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు వెల్లడించింది.కాగా, మంటల వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, యూనిట్ శీతలీకరణ ప్రారంభమైందని తెలిపింది. ఉత్పత్తి, ఎగుమతి కార్యకలాపాలు ప్రభావితం కాలేదని, ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సంబంధిత అత్యవసర ఆరోగ్యం, భద్రత, పర్యావరణ చర్యలు చేపట్టామని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com