రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ త్వరలోనే అప్డేట్.!
- July 03, 2023
‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రస్తుతం ఆగిన కారణంగా, రామ్ చరణ్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టబోతున్నాడట. ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఓ ప్రాజెక్ట్ సెట్ చేసి పెట్టిన సంగతి తెలిసిందే.
ఆగస్టులో ఈ సినిమాని ప్రారంభించాలనుకున్నారు. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూట్ చేయాలనుకున్నారు. కానీ, ప్రస్తతుం ‘గేమ్ ఛేంజర్’ ఆగిపోవడంతో, ఈ ప్రాజెక్టును లైన్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నాడట.
ఆల్రెడీ స్ర్కిప్టు వర్క్ ఓ కొలిక్కి వచ్చిందనీ తెలుస్తోంది. సో, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలనుకుంటున్నారట.
రామ్ చరణ్‌తో సినిమా అంటే ఇప్పుడది ప్యాన్ ఇండియా మూవీనే. సో, కాస్ట్ అండ్ క్రూ కూడా ఆ రేంజ్‌లోనే వుండాలి. సో, హీరోయిన్గా ఆ స్థాయి ఇమేజ్ వున్న ముద్దుగుమ్మనే ఎంచుకోవాలనుకుంటున్నారట. ఆ లిస్టులో దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా పేర్లు పరిశీలనలో వున్నాయ్.
అలాగే మ్యూజిక్ కోసం రెహమాన్ పేరు పరిశీలిస్తున్నారట. బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదు. పూర్తి వివరాలతో త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వబోతున్నారట బుచ్చిబాబు అండ్ టీమ్.
తాజా వార్తలు
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు







