రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ త్వరలోనే అప్డేట్.!

- July 03, 2023 , by Maagulf
రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ త్వరలోనే అప్డేట్.!

‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రస్తుతం ఆగిన కారణంగా, రామ్ చరణ్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టబోతున్నాడట. ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఓ ప్రాజెక్ట్ సెట్ చేసి పెట్టిన సంగతి తెలిసిందే.
ఆగస్టు‌లో ఈ సినిమాని ప్రారంభించాలనుకున్నారు. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూట్ చేయాలనుకున్నారు. కానీ, ప్రస్తతుం ‘గేమ్ ఛేంజర్’ ఆగిపోవడంతో, ఈ ప్రాజెక్టును లైన్‌లో పెట్టేందుకు సిద్ధమవుతున్నాడట.
ఆల్రెడీ స్ర్కిప్టు వర్క్ ఓ కొలిక్కి వచ్చిందనీ తెలుస్తోంది. సో, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలనుకుంటున్నారట. 
రామ్ చరణ్‌తో సినిమా అంటే ఇప్పుడది ప్యాన్ ఇండియా మూవీనే. సో, కాస్ట్ అండ్ క్రూ కూడా ఆ రేంజ్‌లోనే వుండాలి. సో, హీరోయిన్‌గా ఆ స్థాయి ఇమేజ్ వున్న ముద్దుగుమ్మనే ఎంచుకోవాలనుకుంటున్నారట. ఆ లిస్టులో దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా పేర్లు పరిశీలనలో వున్నాయ్. 
అలాగే మ్యూజిక్ కోసం రెహమాన్ పేరు పరిశీలిస్తున్నారట. బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదు. పూర్తి వివరాలతో త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వబోతున్నారట బుచ్చిబాబు అండ్ టీమ్. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com