తన క్లాస్‌మేట్స్, కుటుంబ సభ్యులను కలుసుకున్న యూఏఈ అధ్యక్షుడు

- July 08, 2023 , by Maagulf
తన క్లాస్‌మేట్స్, కుటుంబ సభ్యులను కలుసుకున్న యూఏఈ అధ్యక్షుడు

యూఏఈ: యూఏఈ  అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సహవిద్యార్థులను, వారి కుటుంబ సభ్యులతో కలిసి కలుసుకున్నారు.  వైస్ ప్రెసిడెంట్, ఉప ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ప్రెసిడెన్షియల్ కోర్ట్ మంత్రి హిస్ హైనెస్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా హాజరయ్యారు. ఈ స్నేహపూర్వక సమావేశంలో తన సహోద్యోగులను కలుసుకున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరితో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఫోటోలు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ తన క్లాస్‌మేట్‌లను పలకరిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com