సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో రెండు కొత్త పర్యాటక స్టేషన్లు

- July 08, 2023 , by Maagulf
సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో రెండు కొత్త పర్యాటక స్టేషన్లు

మస్కట్: సందర్శకులకు ఆహ్లాదకరమైన మరియు విలక్షణమైన పర్యాటక అనుభవాన్ని అందించడానికి... అల్ అష్ఖారా ఫోరమ్ రాస్‌ అల్-హద్ స్టేషన్ తో పాటు అల్ కమిల్, అల్-వాఫీ విలాయత్‌లలో ఏకీకృత పర్యాటక స్టేషన్ ప్రారంభించబడింది. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పర్యాటక ప్రదేశాలను సందర్శకులను పరిచయం చేయడం, వారికి ఉత్తేజకరమైన మరియు ఆనందించే అనుభవాన్ని అందించడం ఈ స్టేషన్‌ల లక్ష్యం. అజ్వా అల్ అష్ఖారా కార్యకలాపాలు జూలై 5న ప్రారంభమయ్యాయి. జూలై 24 వరకు ఇవి కొనసాగుతాయని అల్-కమిల్, అల్-వాఫీ డిప్యూటీ గవర్నర్, అల్-అష్ఖారా ఫోరమ్ ప్రధాన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు  షేక్ ముహమ్మద్ బిన్ అలీ అల్ హినై  స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు. అజ్వా అల్-అష్ఖారా ఫోరమ్ ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శకులను ఆహ్వానిస్తుందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com