మెగా సీక్రెట్.! తమ్ముడి సాంగ్ మస్త్ ఇమిటేట్ చేసిన అన్నయ్య.!

- July 18, 2023 , by Maagulf
మెగా సీక్రెట్.! తమ్ముడి సాంగ్ మస్త్ ఇమిటేట్ చేసిన అన్నయ్య.!

మెగాస్టార్ చిరంజీవి ‘చిరు లీక్స్’ పేరిట తన సినిమాలకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ముందుగానే ఇచ్చేస్తూంటారన్న సంగతి తెలిసిందే. అనుకోకుండా ఒక్కోసారి చిరంజీవి నోటి నుంచి వచ్చేసే లీక్స్ కొన్ని అయితే, కావాలనే చిరంజీవి లీక్ చేసిన ఐటెమ్స్ ఇంకొన్ని.

అవి ఎలా లీక్ అయినా సరే, చిరు నోటి నుంచి వచ్చాయంటే వాటికుండే వైరల్ కిక్కే వేరప్పా. తాజాగా చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ సీక్రెట్ ఎలిమెంట్‌ని తాజాగా చిరు లీక్ చేశారు.

ఈ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలోని ఓ సాంగ్‌కి చిరు స్టెప్స్ వేయడం, పవన్ కళ్యాణ్ మేనరిజంని ఇమిటేట్ చేయడం చేశారట. ఇదేమీ గాసిప్ వార్త కాదండోయ్. 

స్వయంగా చిరంజీవే ‘లీకు’ రూపంలో ఓ చిన్న శాంపిల్ వీడియో ద్వారా సోషల్ మీడియాలో వదిలేశారు. సినిమాలో ఈ పార్ట్ అద్ధిరిపోద్దని చిరు చెప్పారు. అలాగే, జస్ట్ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి చేసిన ‘చిరు ప్రయత్నం’ మాత్రమే ఇది అని ఆయన ఓ వీడియో ద్వారా చెప్పారు. 

ఆగస్టు 11న ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా, కీర్తి సురేష్‌లు ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com