‘గుంటూరు కారం’ గుట్టు రట్టు చేసిన మీనాక్షి.!

- July 18, 2023 , by Maagulf
‘గుంటూరు కారం’ గుట్టు రట్టు చేసిన మీనాక్షి.!

మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’ చివరి షెడ్యూల్ షూటింగ్ సూపర్ ఫాస్ట్‌గా జరిగిపోతోంది. తొలి షెడ్యూల్ ముచ్చట్లు బాహాటంగా బయటపెట్టి షూటింగ్ చేసిన చిత్ర యూనిట్, మధ్యలో కలిగిన ఆటంకాల కారణంగా గుట్టు చప్పుడు కాకుండా చివరి షెడ్యూల్‌ని పూర్తి చేసేస్తోంది.

జరుగుతుందంటే, జరుగుతుందనే తప్ప.. నిజంగా జరుగుతుందా.? అనే దానిపై క్లారిటీ లేదింత వరకూ. అయితే, తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయన్ మీనాక్షి చౌదరి ఈ విషయాన్ని కన్‌ఫామ్ చేసింది.

అవును నిజమేనట.. షూటింగ్ ఫాస్ట్‌గా జరుగుతోందట. అలాగే, తన పాత్రపై ఇంతవరకూ ప్రచారమే జనానికి తెలిసింది. కన్‌పామేషన్ ఇచ్చేసింది తాజాగా మీనాక్షి చౌదరి. నిజానికి మీనాక్షి పేరును చిత్ర యూనిట్ అధికారికంగా కన్‌ఫామ్ చేయలేదింత వరకూ. 

ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీనాక్షి ఇలా ‘గుంటూరు కారం’కి సంబంధించిన తాజా అప్డేట్ ఇచ్చి పడేసింది. అన్నట్లు ఈ సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ రోల్ పోషిస్తుండగా, ఫస్ట్ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com