మెగా సీక్రెట్.! తమ్ముడి సాంగ్ మస్త్ ఇమిటేట్ చేసిన అన్నయ్య.!
- July 18, 2023
మెగాస్టార్ చిరంజీవి ‘చిరు లీక్స్’ పేరిట తన సినిమాలకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ముందుగానే ఇచ్చేస్తూంటారన్న సంగతి తెలిసిందే. అనుకోకుండా ఒక్కోసారి చిరంజీవి నోటి నుంచి వచ్చేసే లీక్స్ కొన్ని అయితే, కావాలనే చిరంజీవి లీక్ చేసిన ఐటెమ్స్ ఇంకొన్ని.
అవి ఎలా లీక్ అయినా సరే, చిరు నోటి నుంచి వచ్చాయంటే వాటికుండే వైరల్ కిక్కే వేరప్పా. తాజాగా చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ సీక్రెట్ ఎలిమెంట్‌ని తాజాగా చిరు లీక్ చేశారు.
ఈ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలోని ఓ సాంగ్‌కి చిరు స్టెప్స్ వేయడం, పవన్ కళ్యాణ్ మేనరిజంని ఇమిటేట్ చేయడం చేశారట. ఇదేమీ గాసిప్ వార్త కాదండోయ్.
స్వయంగా చిరంజీవే ‘లీకు’ రూపంలో ఓ చిన్న శాంపిల్ వీడియో ద్వారా సోషల్ మీడియాలో వదిలేశారు. సినిమాలో ఈ పార్ట్ అద్ధిరిపోద్దని చిరు చెప్పారు. అలాగే, జస్ట్ ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేయడానికి చేసిన ‘చిరు ప్రయత్నం’ మాత్రమే ఇది అని ఆయన ఓ వీడియో ద్వారా చెప్పారు.
ఆగస్టు 11న ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా, కీర్తి సురేష్‌లు ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకుడు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!