మొత్తానికి ‘బేబీ’కి వర్కవుట్ అయ్యింది.!
- July 18, 2023‘బేబీ’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.
యూట్యూబర్ వైష్ణవీ చైతన్య హీరోయిన్గా డెబ్యూ చేయగా, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. కాగా, ప్రమోషన్లు ఓ సినిమాని హిట్ లిస్టులో ఎలా నిలబెడతాయో ఈ సినిమాని చూసి అర్ధం చేసుకోవచ్చు.
హార్ట్ఫుల్గా ప్రమోషన్లు చేశారు. అక్కడే సగం మార్కులు కొట్టేశారు చిత్ర యూనిట్. రివ్యూలు ఎలా వచ్చినా, ప్రమోషన్స్ కారణం కావచ్చు.. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్సే వచ్చాయ్.
వీకెండ్ కలెక్షన్లు కూడా బాగున్నాయ్. ఓ చిన్న సినిమాకి ఇంతకన్నా కావల్సిందేముంటుంది. ‘బేబీ’గా వైష్ణవీ చైతన్యకీ మంచి డెబ్యూ మూవీ అనే చెప్పుకొచ్చు.
తొలి సినిమాకే యాక్టింగ్ పరంగా తానేంటో ప్రూవ్ చేసుకుంది కాబట్టి, వైష్ణవికి ఈ సినిమా కలిసొచ్చే అంశమే. మరో రెండు మూడు ఇలాంటి సినిమాలే పడితే, వైష్ణవి టాలీవుడ్లో స్టార్డమ్ దక్కించుకునే అవకాశాల్లేకపోల్లేదన్న అభిప్రాయాలొస్తున్నాయ్.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు