మొబైల్ IDతో డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌లు

- July 19, 2023 , by Maagulf
మొబైల్ IDతో డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌లు

కువైట్: డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌లు చెల్లుబాటు అయ్యే పత్రంగా మొబైల్ IDని ఆమోదించారు. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖలీద్ అల్-సబాహ్ మంత్రివర్గం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కువైట్ మొబైల్ ID యాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్,  వాహన రిజిస్ట్రేషన్‌లను అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర లావాదేవీలలో చెల్లుబాటు అయ్యే అధికారిక పత్రంగా ఆమోదించారు. కువైట్ మొబైల్ ID యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనాన్ని నడపడానికి అనుమతిని దేశంలోని అన్ని అధికారులు ఆమోదించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర లావాదేవీలలో తప్పనిసరిగా మొబైల్ IDని అంగీకరించాలని కేబినెట్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com