జెడ్డా విమానాశ్రయంలో పట్టుబడ్డ ఓ ప్రయాణికుడు
- July 19, 2023
జెడ్డా: జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణికుడి నుండి హెరాయిన్, నల్లమందును స్వాధీనం చేసుకొని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సౌదీ అరేబియాకు వస్తున్న ఓ ప్రయాణికుడి కడుపులో 1.3 కిలోల కంటే ఎక్కువ హెరాయిన్, 41.7 గ్రాముల నల్లమందు దాచిపెట్టినట్లు జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న తర్వాత, రాజ్యంలో ఇంత మొత్తంలో మాదకద్రవ్యాలను స్వీకరించాల్సిన వారిని కూడా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జిడిఎన్‌సి)తో సమన్వయంతో అరెస్ట్ చేసినట్టు అథారిటీ తెలిపింది. ఇద్దరు అనుమానితుల అరెస్ట్‌తో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







