ఇండియా బియ్యం ఎగుమతిపై నిషేధం ఒమన్ మార్కెట్లపై ఉంటుందా?
- July 30, 2023
మస్కట్: బియ్యం ఎగుమతిపై ఇండియా నిషేధం విధించాక..యుఎస్ఎలో భారతీయ కమ్యూనిటీ బియ్యం కొనుగోలు కోసం ప్రముఖ సూపర్ మార్కెట్‌లకు పోటెత్తారు. అయితే, ఒమన్ సుల్తానేట్‌లో ఇలాంటి భయాందోళనలు లేదా హడావిడి కనిపించడం లేదని మార్కెట్ల నిర్వాహకులు చెబుతున్నారు. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధిస్తూ జూలై 20న భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒమన్‌లోని ప్రధాన బియ్యం వ్యాపారులు నిషేధం ప్రభావం చూపుతుందని, అయితే 2007-2008లో నిషేధం సుల్తానేట్‌లో బియ్యం నిల్వల కొరతకు దారితీసినప్పటి పరిస్థితా కాదని చెబుతున్నారు. నిషేధం ధరలలో స్వల్ప పెరుగుదలకు దారితీయవచ్చని ప్రముఖ బియ్యం వ్యాపారులు చెప్పారు. అయితే ఈ లోటును పూరించడానికి ఇతర దేశాల నుండి వచ్చే బియ్యం రకాలతో సమస్య త్వరలో పరిష్కరించబడుతుందన్నారు."ఒమన్‌లో మాకు పుష్కలంగా నిల్వలు ఉన్నాయి. స్థానిక జనాభాలో అత్యధిక బియ్యం వినియోగం బాస్మతి బియ్యం కాబట్టి నేను చాలా ఆందోళన చెందడం లేదు." అని బియ్యం వ్యాపారి తెలిపారు.
భారతదేశ బియ్యం రవాణా
2022లో భారతదేశ బియ్యం ఎగుమతులు రికార్డు స్థాయిలో 22.2 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఇది ప్రపంచంలోని తదుపరి నాలుగు అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారులైన థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్తాన్ మరియు అమెరికాల సంయుక్త రవాణా కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఒమన్ పొరుగున ఉన్న యూఏఈ భారతీయ బియ్యంతో సహా నాలుగు నెలల పాటు బియ్యం ఎగుమతులు, రీ-ఎగుమతులను నిషేధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









